Monday, January 20, 2025

నేను ఆరోగ్యంగానే ఉన్నా: ఎంపి కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తన అస్వస్థత వార్తలన్నీ అవాస్తవమని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తన ఆరోగ్యంపై ఓ ఛానల్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను హైదరాబాద్‌లోని తన నివాసంలోనే ఉన్నానని, తనకు ఎలాంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్ రాలేదని ఆయన తెలిపారు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే సహించేది లేదని, తప్పుడు వార్త ప్రసారం చేసినందుకు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు.

మంగళవారం నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన చెల్లబోయిన ఉపేందర్ కుటుంబాన్ని కలిశానని, ఆ కుటుంబానికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం చేశానని ఆయన తెలిపారు. తన అస్వస్థతపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనపడవద్దని, అలాంటి ప్రచారాలను నమ్మవద్దన్నారు. కొన్ని ఛానల్స్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా వార్తలు ప్రసారం చేస్తున్నాయన్నారు. ఛానల్ తప్పుడు ప్రచారం పై ఇప్పటికే బంజారాహిల్స్ పిఎస్‌లో ఫిర్యాదు చేశానన్నారు. తప్పుడు వార్త ప్రసారం చేసినందుకు సంబంధిత ఛానల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేటింగ్స్ కోసం ఫేక్ న్యూస్‌లు ప్రసారం చేస్తూ జనాన్ని ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదని కోమటిరెడ్డి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News