హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పై కాంగ్రెస్ ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డికి మాపైన విమర్శలు చేసే నైతిక అర్హత లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ కోసం రాజీనామా చేయని వ్యక్తి కిషన్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. పార్లమెంటు సమావేశాలకు వ స్తున్నప్పుడు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం వల్ల తాము ఆ సమయంలో పార్లమెంట్‌లో లేమన్నారు.
ఇప్పటికైకా కిషన్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకో అని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్నారు. స్వయంగా మహిళా రిజర్వేషన్‌కు మద్దతిస్తున్నామని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పారని కోమటిరెడ్డి గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు మా బిల్లు అంటూ సోనియా గాంధీ ప్రకటన కూడా చేశారని, మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయ్యేటప్పుడు 66 మంది బీ జేపీ ఎంపీలు కూడా లేరన్నారు.
66 మంది బిజెపి ఎంపిలు ఎందుకు లేరో బిజెపి అధ్యక్షు డు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని, మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని చెప్పిందే కాంగ్రెస్ పార్టీ అని ఎంపి కోమటి రెడ్డి అన్నారు. కేవలం ఎన్నికల కోసం మహిళా రిజర్వేషన్ అంటూ ప్రత్యేక పార్లమెంటు సమావేశా లు బిజెపి ఏర్పాటు చేసిందని విమర్శించారు.