Sunday, December 22, 2024

భువనగిరిలో గెలుపు కాంగ్రెస్ పార్టీదే: ఎంపి కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అని మాజీ మంత్రి భువనగిరి ఎంపీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం భువనగిరిలో పర్యాటించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బిఆర్‌ఎ్‌సకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రజారంజక పాలన చేసే కాంగ్రె్‌సకు అధికారాన్ని అప్పగించేందుకు నిర్ణయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హమీలను విస్మరించాయని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. చరిత్రలో భువనగిరి పోరాటాలకు నిలయంగా పేరు ఉందని ఆయన అన్నారు.

జిల్లా కేంద్రంలోని ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో ఫ్యాన్సు బాత్రూమ్స్, సరైన సదుపాయాలు లేకపోతే తన సొంత నిధులతో 20 లక్షలు పెట్టి అంతా బాగు చేయించామని అన్నారు. భువనగిరి మైనార్టీ ప్రజల కోసం 20 లక్షలు పెట్టి దర్గా కట్టించి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. పేద విద్యార్థులు నా దగ్గరకు ఫీజుల ఇబ్బంది ఉందని వస్తే పార్టీలకు అతీతంగానే సాయం చేస్తున్నామని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని ఆశా భావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సర్వేలనీ అనుకూలంగా ఉన్నాయని, ఏ సర్వే చూసినా కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతోందన్నారు. వడగళ్ల వానకు పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్నారని మండిపడ్డారు.ఇటు భువనగిరి నియోజకవర్గంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉందని. గెలుస్తుందనే పూర్తి నమ్మకం తమకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రూప్-2 పరీక్ష పోస్ట్ పోన్ చేయమంటే చేయడం లేదని విమర్శించిన ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలను పారదర్శకంగా ఇస్తామని జోస్యం చెప్పారు.24 గంటల కరెంట్ పై ప్రభుత్వం చెప్పేవి అన్నీ అబద్ధాలని లాగ్ బుక్స్ తో అన్నీ బయటపెట్టి న్నట్లు ఆయన తెలిపారు. మరోసారి సబ్ స్టేషన్ దగ్గర ధర్నాకు దిగుతామని దెబ్బకు ఈసారి కేసీఆర్ దిగి రావాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇస్తామని ఎంపీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ పైనే చేస్తామని, అర్హులైన అందరికీ 4 వేల రూపాయల పెన్షన్ ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఈనెల 16, లేదా 17 తర్వాత బస్సుయాత్ర మొదలుపెడతామని తెలంగాణ రాష్ట్రమతా కాంగ్రెస్ నేతలందరం కలిసి పర్యటిస్తామని పార్టీ అధికారంలోకి రావడానికి అందరం కలసి కట్టుగా పనిచేస్తాయి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News