Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలయ్యింది. తాజాగా ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇబ్బంది పెడుతున్నారని యాదాద్రి భువనగిరి డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కెసిఆర్ అనిల్‌కుమార్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత కొన్ని రోజులుగా ఎంపి కోమటిరెడ్డికి డిసిసి అధ్యక్షుడు అనిల్‌కు పొసగడం లేదు. భువనగిరిలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం జరిగింది. ఆ సమావేశంలో ఆయన కార్యకర్తలతో తను పార్టీ మారే విషయమై వారితో చర్చించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వల్ల తాను పడుతున్న ఇబ్బందులను వారితో పంచుకున్నారు. అనంతరం వారి సూచనల మేరకు ఆయన బిఆర్‌ఎస్‌లో చేరారు.

భువనగిరిలో కార్యకర్తల సమావేశం అనంతరం కుంభం మీడియాతో మాట్లాడుతూ ప్రజాసేవ లక్ష్యంతో వ్యక్తిగత పనులున్నా ఏళ్లుగా కాంగ్రెస్ కేడర్‌ను కాపాడుకుంటూ వస్తున్నానని ఆయన తెలిపారు. పార్టీ కోసం పాటుపడే తనను, కార్యకర్తలను ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్రూపు రాజకీయాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించడం, కార్యకర్తలను మనోభావాలను దెబ్బతీసేలా చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్రూపు రాజకీయాల గురించి చర్చించడానికే ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నానని ఆయన చెప్పారు. కోమటిరెడ్డి వల్లే భువనగిరి ఎమ్మెల్యే సీటును ఓడిపోయామని ఆయన ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోమటిరెడ్డి స్థానిక గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News