Friday, December 20, 2024

అన్నం పెట్టే రైతులకి సంకెళ్లు వేసిన ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భువనగిరి ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులపై కేసులు నమోదు చేసి సంకెళ్లు వేయడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు అన్నారు. గతంలోనూ ఖమ్మం మిర్చి యార్డులో రైతులకు బెడీలు వేసి రైతాంగాన్ని బిఆర్‌ఎస్ ప్రభుత్వం అవమానించిందన్నారు. అన్నం పెట్టే రైతులకి సంకెళ్లు వేసిన ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్ అని విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రీజనల్ రింగ్ కోసం భూసేకరణ పేరుతో దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆరోపించారు.

దీనిపై శాంతియుతంగా ఆందోళన నిర్వహి స్తున్న రైతులను అరెస్ట్ చేసి జైలుకు పంపారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. రైతుల చేతికి బేడీలు వేయడం చూసి కళ్లలో నీళ్లు తిరిగాయని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడంపై యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే వివాదం పెద్దదవుతున్న నేప థ్యంలో పోలీసులు స్పందించారు.
వాళ్లసలు రైతులే కాదు.. యాదాద్రి భువనగిరి డిసిపి వివరణ

భువనగిరి కోర్టు ముందు ఒక కేసులో ఉన్న నలుగురు నిందితులను బేడీలతో తీసుకురావడంపై వస్తున్న అభ్యంతరాల గురించి యాదాద్రి భువనగిరి డిసిపి ఎం.రాజేష్ చంద్ర వివరణ ఇచ్చారు. అరెస్టయిన వారిలో రైతులు ఎవరూ లేరన్నారు. అయిన ప్పటికీ మీడియాలో వస్తున్న అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని బందోబస్తులో ఉన్న ఇంఛార్జీపై క్రమశిక్షణా చర్య తీసుకున్నామన్నారు. ఆర్‌ఆర్ ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చాలని గతనెల 29, 30వ తేదీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిరాహార దీక్షలు చేశారని,

మే 30న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై సమీక్ష నిర్వహించిన మంత్రి బయటకు వస్తుండగా గేటు వద్ద ఆయనను అడ్డుకోవటానికి ప్రయత్నించారని, ఈ క్రమంలో ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. వారిపై వేర్వేరు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదయ్యాయని తెలిపారు. కాగా, అరెస్టయిన వారిలో జి.నారా యణరెడ్డి, టి.రవికుమార్‌కు బెయిల్ మంజూరు కావటంతో అదే రోజు విడుదలయ్యారని వెల్లడించారు. మిగిలిన నలుగురిని రిమాండ్‌కు తరలించా మన్నారు.
ప్రోటోకాల్ ననుసరించే సంకెళ్లు…

మంగళవారం నలుగురిని భువనగిరి సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తీసుకు వచ్చినపుడు పోలీసులు వారి చేతులకు బేడీలు వేశా రన్నారు. దీనిపై అన్నివర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఆయా కేసుల్లో పట్టుబడిన వారి ప్రవర్తనను బట్టి ఎంతమంది బందోబస్తుతో తీసుకెళ్లాలో నిర్ణయిస్తామని చెప్పారు. ఈ నలుగురిని అరెస్టు చేసిన సమయంలో పోలీసులను తోసివేయటంతో పాటు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారన్నారు. కలెక్టర్ ఆఫీస్ లోపలికి వెళ్లి నిప్పు కూడా పెట్టినట్టు చెప్పారు. ఇక, అరెస్టయిన వారిలో ఏ ఒక్కరూ రైతు కారని తెలిపారు.

ఈ నలుగురిలో ఓ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తికి 20 గుంటల భూమి ఉన్నట్టు చెప్పారు. దీంట్లో కొంత భూమి ఆర్‌ఆర్‌ఆర్ నిర్మా ణంలో పోతు న్నదని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు. అరెస్టు చేసిన నలుగురిని కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో ప్రొటోకాల్‌ను అనుసరించే సంకెళ్లు వేసినట్టు తెలిపారు. కోర్టుకు తీసుకొస్తున్న సమయంలో కూడా ఈ నలుగురు ఎస్కార్టు సిబ్బందిని ఇబ్బంది పెట్టినట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News