Sunday, December 22, 2024

మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి.. ఆసుపత్రికి తరలింపు

- Advertisement -
- Advertisement -

మెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగింది. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో సోమవారం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రచారం చేస్తూ పర్యటిస్తుండగా గుర్తుతెలియని ఓ వ్యక్తి.. కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశాడు.

ఈ ఘటనలో కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గజ్వెల్ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిని కార్యకర్తలు పట్టుకుని చితకబాదారు. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News