Monday, December 23, 2024

ప్రజలంతా మోడీ వైపే: ఎంపి లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజలంతా ప్రధాని మోడీ వైపే ఉన్నారని ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిరూపించాయని బిజెపి ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. అసంబద్ధ పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు లాంటిదన్నారు. గురువారం మణిపూర్ పర్యటనలో ఉన్న ఎంపి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.. 70 ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈశాన్య రాష్ట్రాలు తొలిసారిగా అభివృద్ధిని రుచి చూశాయన్నారు. మోడీ సర్కార్ చేసిన అభివృద్ధి పనులు చూసి అక్కడి ప్రజలు బిజెపికి ఓటు వేశారని ఆయన తెలిపారు.

ఇనాళ్ళు వామపక్ష తీవ్రవాదం, ఇతర తీవ్రవాదం వైపుకు బలవంతంగా ఈశాన్య రాష్ట్రాలు నెట్టవేయబడ్డాయని అన్నారు. మోడీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతంలో శాంతిస్థాపనకు కృషి చేసిందన్నారు. నాగాలాండ్‌లో మెజారిటీ క్రిస్టియన్లు ఉన్నప్పటికీ కేవలం మోడీ సర్కార్ అభివృద్ధిని చూసి ఆ రాష్ట్ర ప్రజలు బిజెపికి పట్టం కట్టారని అన్నారు. మేఘాలయతో పాటు మూడు రాష్ట్రాలలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావడం మంచి పరిణామం అని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News