Monday, December 23, 2024

ఏ క్షణంలోనైనా బిజెపి అభ్యర్థుల జాబితా ప్రకటించొచ్చు: లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

ఏ క్షణంలోనైనా బిజెపి అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉందని ఎంపి డా లక్ష్మణ్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందన్నారు. రాష్ట్రం నుంచి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి అయ్యిందని… ఏ క్షణంలోనైనా అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉందన్నారు. అభ్యర్థుల ఎంపికలో బిజెపి సామాజిక న్యాయం పాటిస్తుందని లక్ష్మణ్ చెప్పారు. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్ద పీట వేశామని.. మొదటి విడతలో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయిస్తున్నామని ఆయన తెలిపారు. మహిళలకు సీట్ల విషయంలో బిఆరఎస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధర్నాలు చేశారు.. కానీ మహిళలకు సీట్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు బిసీలను పట్టించుకోవడం లేదని.. వారి సేవలను వాడుకుని వదిలేస్తున్నారు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీసి సమాజం బిజెపి వైపు చూస్తోందన్నారు. రాజాసింగ్ సస్పెన్షన్, పోటీ అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తోందని లక్ష్మణ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News