Monday, December 23, 2024

ఎన్‌డిఎ ఎప్పుడైనా కూలిపోతుంది: మల్లు రవి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: త్వరలోనే రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేస్తుందని ఎంపి మల్లు రవి తెలిపారు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామన్నారు.  నాగర్ కర్నూల్ ఎంపి మల్లురవి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి, బిఆర్‌ఎస్ కలిసిన కాంగ్రెస్‌ను ఎదుర్కొలేదని ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికలలో బిఆర్‌ఎస్ పార్టీ చచ్చి, బిజెపికి జీవం పోసిందన్నారు. మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలపై మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉందని, ఎన్‌డిఎ ప్రభుత్వం కూలిపోవడంతో ఖాయమని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఎంపి మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News