మనతెలంగాణ/హైదరాబాద్: మహబూబాబాద్ ఎంపి మాలోత్ కవిత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఓటర్లకు డబ్బు పంపిణీ కేసు రుజువు కావడంతో ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం 6 నెలల జైలు శిక్షతోపాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పును వెలువడించింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాలోత్ కవిత ఓటర్లకు డబ్బు పంపిణీ చేసినట్లు బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కాగా, ఈ కేసుకు సంబంధించి ఎంపీ కవిత వెంటనే రూ.10వేల జరిమానా చెల్లించగా ప్రజా ప్రతినిధుల కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. ఇదిలావుండగా మాజీ మంత్రి రెడ్యా నాయక్ కూతురైన మాలోత్ కవిత తన రాజకీయ జీవితాన్ని 2009లో ప్రారంభించారు. మొదట కాంగ్రెస్‌లో ఉన్న ఆమె అనంతరం టిఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఆమె మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
MP Maloth Kavitha gets 6 months Jail