గుణ(మధ్యప్రదేశ్): తన ఇంటికి అరకిలోమీటరు దూరంలో ఉన్న బోరింగ్ పంపులో నీళ్లు కొట్టి, అక్కడి నుంచి ఇంటికి బిందెలు మోస్తూ అవస్థలు పడుతున్న తన భార్య కష్టాన్ని చూసి భరించలేక ఒక పేద కూలీ ఎవరి సాయం లేకుండా తనే తన ఇంటి ఆవరణలో ఒక బావిని రెండు వారాల్లో తవ్వేశాడు. తన భార్య కష్టాన్ని తీర్చేందుకు అతను పడిన శ్రమను గుర్తించిన జిల్లా యంత్రాంగం అతని జీవనస్థితి మెరుగు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలను వర్తింపచేయడానికి ముందుకు వచ్చింది. ఈ సంఘటన చంచోడ తహసిల్‌లోని భన్‌పూర్ బవా గ్రామంలో ఇటీవల చోటుచేసుకుంది. భరత్ సింగ్(46)కు భార్య, ముదుసలి తల్లి, ఒక సంతానం ఉన్నారు. ప్రతి రోజు అతని భార్య నీటి కోసం అరకిలోమీటరు దూరంలో ఉన్న హ్యాండ్-పంపు వద్దకు వెళుతుంది. దీంతో అతను ఇంటి ఆవరణలోనే రెండు వారాల్లో 31 అడుగుల లోతు, 6 అడుగుల వెడల్పుతో బావిని తానే తవ్వాడు. ఈ బావిలో సమృద్ధిగా నీరు పడడంతో అతని ఇంటి అవసరాలు తీరిపోవడంతోపాటు అతనికి ఉన్న కొద్దిపాటి పొలానికి కూడా నీళ్లు లభిస్తున్నాయి.
భార్య కష్టాన్ని చూడలేక.. ఒక్కడే బావి తవ్వేశాడు
- Advertisement -
- Advertisement -
- Advertisement -