Saturday, January 18, 2025

‘కమలంలో’ కలవరం

- Advertisement -
- Advertisement -

జమిలి ఎన్నికల బిల్లులు ప్రవేశపెట్టడంపై జరిగిన ఓటింగ్‌కు 20మంది బిజెపి ఎంపిలు గైర్హాజరు
డుమ్మాకొట్టిన వారిలో మంత్రులు నితిన్ గడ్కరి, జ్యోతిరాధిత్య సింథియా సహా పలువురు సీనియర్
నాయకులు నోటీసులు జారీచేసే యోచనలో హైకమాండ్ లోక్‌సభలో జమిలి బిల్లుల
ప్రవేశానికి అనుకూలంగా 269ఓట్లు.. వ్యతిరేకంగా 198మంది బిల్లులకు ఆమోదముద్ర కష్టమే
మూడింట రెండు వంతుల మెజార్టీ అసాధ్యం ఎన్‌డిఎ కూటమిపై ప్రతిపక్షం విసుర్లు

న్యూఢిల్లీ: ఒకవైపు కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన జమిలి ఎన్నికల బిల్లులు లోక్‌సభలో ప్రవేశపెడుతుండగా అధికార బిజెపి సభ్యులు పలువురు గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. సభ కు తప్పనిసరిగా హాజరుకావాలని విప్ జారీ చేసినప్పటికీ మంగళవారంనాడు ఆ పార్టీకి చెందిన 20మంది సభ్యులు లోక్‌సభకు రాలేదు. జమిలి బిల్లులను సభలో ప్రవేశపెట్టే అంశంపై చర్చ జరిగి ఓటింగ్ జరుగుతున్నప్పుడు గైర్హాజరు అయిన వి షయాన్ని గుర్తించారు. అయితే సభ్యులు సభకు రాకపోవడంపై బిజెపి అధిష్ఠానం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దీనిపై కఠినంగా వ్యహరించాలని, సభకు హాజరుకా ని సభ్యులకు నోటీసులు పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. సభకు గైర్హాజరయిన వారిలో శంతను ఠాకూర్, జగదాంబికా పాల్, రాఘవేంద్ర ద్వారా, గిరిరాజ్ సింగ్, నితిన్ గడ్క రీ, జ్యోతిరాదిత్య సింధియా, విజయ్ బఘేల్, ఉదయరాజె భోస్లే, జగన్నాథ్ స ర్కార్, జయంత్ కు మార్ రాయ్ ఉన్నారు. ప్రధాని మోడీ కూడా హాజరుకానప్పటికీ ఆయన ముందుగానే విప్‌కు సమాచారమిచ్చి జై పూర్ పర్యటకు వెళ్లారు. ఇక మిగతా 20మంది ఎంపిలు సభకు రాకపోవడానికి గల కారణాలను స్వయంగా తెలుసుకున్న తర్వాత నోటీసులు జారీ చేయాలని బిజెపి అధిష్ఠానం ఆలోచనగా ఉంది.

జమిలి బిల్లు గట్టెక్కడం కష్టమే
అధికార బిజెపి ‘ఒక దేశం, ఒకే ఎన్నిక లు’ లక్షంలో భాగంగా రాజ్యాంగ సవరణకు, జమిలి ఎన్నికలకు వీ లు కల్పించే రెండు బిల్లులు ప్రవేశపెట్టడానికి లోక్‌సభ మం గళవారం డివిజన్ వోటు నిర్వహించింది. నిబంధనల ప్రకా రం, సాధారణ ఆధిక్యంలో రెం డు బిల్లులను పార్లమెంట్‌లో లాం ఛనంగా ప్రవేశపెట్టారు. ప్రతిపాదనకు అనుకూలంగా 269 మంది ఎంపిలు, వ్య తిరేకంగా 198 మంది ఎంపిలు వోటు వేశారు. అయితే, ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లు విమర్శకులు ఆ తేడాను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. బిల్లులను ఆమోదించడానికి ప్రభుత్వానికి ఈ దశలో సైతం తగినంత మద్దతు లేదని ఇది సూచిస్తోందని వారు అంటున్నారు. ‘మొత్తం 461 వోట్లలో మూడింట రెండు వంతుల మెజారిటీ (అంటే 307) అవసరం.. కానీ ప్రభుత్వం 269 వోట్లు పొందింది. ప్రతిపక్షాలకు 198 లభించాయి. ‘ఒక దేశం ఒకే ఎన్నికలు’ ప్రతిపాదన మూడింట రెండు వంతుల మద్దతు పొందలేకపోయింది’ అని కాంగ్రెస్ ఎంపి మాణిక్కమ్ ఠాగూర్ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇవోటింగ్ విధానం స్క్రీన్‌షాట్‌ను ఆయన పంచుకున్నారు. ఠాగూర్ పార్టీ సహచరుడు శశి థరూర్ కూడా సంఖ్యా బలంలో అంతరాన్ని ప్రస్తావించారు.

‘ప్రభుత్వానికి నిస్సందేహంగా అధిక సంఖ్యా బలం ఉంది& కానీ (రాజ్యాంగ సవరణకు బిల్లులను) ఆమోదించేందుకు మీకు మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి. కానీ వారికి అది స్పష్టంగా లోపించింది’ అని థరూర్ లోక్‌సభ స్వల్పకాల వాయిదా అనంతరం విలేకరులతో చెప్పారు. ‘దీని గురించి వారు మరీ ఎక్కువగా పట్టుబట్టలేరని విదితం అవుతోంది’ అని ఆయన అన్నారు. నిబంధనల ప్రకారం, ఆ రాజ్యాంగ సవరణ బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొందడానికి హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది మద్దతు, వోటింగ్ కావలసి ఉంటుంది. కాంగ్రెస్ మంగళవారం ప్రతిపాదనను ఒక ఉదాహరణగా సూచిస్తూ, రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి వోటింగ్‌లో 461 మంది సభ్యులు పాల్గొన్నారని తెలిపింది. బిల్లు ఆమోదముద్రకు ఇదే వోటింగ్ అయినట్లయితే ఆ 461 మందిలోకి 307 మంది బిల్లుకు అనుకూలంగా వోటు వేయవలసి ఉంటుంది. కానీ 269 మంది మాత్రమే వోటు వేశారు. దీనితో‘ఈ బిల్లుకు మద్దతు లేదు& అనేక పార్టీలు దీనికి వ్యతిరేకంగా మాట్లాడాయి’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ ఆనందాతిరేకాలు ముందస్తువైనా ఒక విధంగా వాస్తవికమే.

ప్రస్తుతం బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ శిబిరంలో 293 మంది ఎంపిలు ఉన్నారు, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిలో 234 మంది ఎంపిలు ఉన్నారు. ఎన్‌డిఎ సభ్యులు అందరూ హాజరైనా రాజ్యాంగ సవరణకు బిల్లులు ఆమోదించేందుకు ఆ బలం సరిపోదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కనుక బిజెపి తమతో పొత్తు లేని పార్టీల నుంచి మద్దతు పొందవలసి ఉంటుంది. ఆ విషయంలో రెండు అవకాశాలు ఉన్నాయి. వైసిపికి నలుగురు ఎంపిలు, అకాలీ దళ్‌కు ఒకరు ఉన్నారు. ఆ రెండు పార్టీలు బిల్లుకు మద్దతు ఇస్తామని వాగ్దానం చేశాయి. అంటే, తన ‘ఒక దేశం ఒకే ఎన్నికలు’ కలను లోక్‌సభలో సాఫల్యం చేసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీకి కనీసం మరి తొమ్మిది వోట్లు అవసరం అవుతాయి. వాటిని సమీకరించడం బిజెపి అసాధ్యం కాదు. అయితే, లోక్‌సభలో పూర్తి స్థాయిలో సభ్యులు ఉన్న పక్షంలో బిజెపికి ఇంకా 64 వోట్లు కావలసి ఉంటుంది. ప్రస్తుతానికి బిల్లును పార్లమెంట్ సంయుక్త కమిటీ పరిశీలనకు పంపవచ్చు. లోక్‌సభలో ప్రతి పార్టీ సంఖ్యా బలాన్ని బట్టి కమిటీ కూర్పు ఉంటుంది. అంటే. బిజెపికి గరిష్ఠ సంఖ్యలో సభ్యులు కమిటీలో ఉంటారు. కమిటీకి బిజెపి సారథ్యం వహిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News