- Advertisement -
లిక్కర్ స్కామ్ విషయంలో కేజ్రీవాల్ దాటవేతలు సాగవని బిజెపి ఎంపి మనోజ్ తివారీ విమర్శించారు. తొమ్మిదోసారి కూడా ఆయన ఇడి సమన్లను బేఖాతరు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇకపై ఆయనకు ఎటువంటి ఊరట కల్పించరాదని, చట్టన్యాయపరంగా తగు చర్యలు తీసుకోవల్సి ఉందని సోమవారం ఈ ఎంపి డిమాండ్ చేశారు. ఢిల్లీవాలాలకు ఆప్ నేత ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇక ఇటువంటి చేష్టలు కుదరవని తెలిపారు. కాగా ఢిల్లీ బిజెపి అధికార ప్రతినిధి హరీష్ ఖురానా స్పందిస్తూ కేజ్రీవాల్‌కు చట్టం పట్ల కనీస గౌరవం లేదని రుజువు అయిందని విమర్శించారు. పలు సాకులతో విచారణకు రాకుండా ఉండాలని కేజ్రీవాల్ ఆలోచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో వర్చువల్‌గా విచారణకు వస్తానని చెప్పిన శాల్తీ ఇప్పుడే ఈ పని చేయవచ్చు కదా అని నిలదీశారు.
- Advertisement -