Monday, December 23, 2024

మన ఊరు – మన చెరువు పండగలో ఎంపి, ఎంఎల్‌ఎ

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మన చెరువు, ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి తో కలిసి సత్తుపల్లి పట్టణ శివారు వేశ్య కాంతుల చెరువు వద్ద కట్టా మైసమ్మ, గంగమ్మ తల్లుల పూజ నిర్వహించారు. బేతుపల్లి చెరువు ప్రత్యామ్నాయ కాలువకు ఎన్టీఆర్ కాలువగా నామకరణం చేస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఇటీవల బెస్ట్ ఇంజనీర్ గా ఎంపికైన శ్రీనివాస్ రెడ్డీని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసం పూడి మహేష్, కమిషనర్ సుజాత, సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ సెక్రటరీ దాసరి ప్రభాకర్ రెడ్డి, డివిజన్ కమిటీ అధ్యక్షులు వాసు వనమా, మేనేజర్ శ్రీనివాసరావు, డి ఈ మరియన్న, జే ఈ వెంకటేశ్వరరావు, చెరువు ఆయ కట్టు రైతులు, టిఆర్‌ఎస్ అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News