Monday, January 20, 2025

వీది రౌడీకి పవన్ కు తేడా లేదు: ఎంవివి సత్యనారాయణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: వీది రౌడీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తేడా లేదని ఎంపి ఎంవివి సత్యనారాయణ మండిపడ్డారు. నని రాజీనామా చేయమనడానికి పవన్ ఎవరు అని ఎంవివి రీకౌంటర్ ఇచ్చారు. జనసేన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. ఆయనకు కనీసం ఎంఎల్‌ఎగా కూడా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎంపిగా గెలిచిన తన గురించి పవన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఒక్కటి కూడా పవన్‌లో లేదని ఎంవివి దుమ్మెత్తిపోశారు. డిడిఆర్ గురించి పవన్‌కు కనీప పరిజ్ఞానం ఉందా? అని అడిగారు. డిడిఆర్ రూల్ ప్రకారం ఉన్న రోడ్డు పెద్దవిగా చేయడం, కొత్త రోడ్లను నిర్మించడం లాంటివి ఉంటాయని చెప్పారు. సినిమాల్లో గంతులేస్తే నాయకులు కాలేరని పవన్ కు ఎంవివి చురకలంటించారు.

Also Read: యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News