Monday, December 23, 2024

నిరుపేదలకు ఎంపి నామా వెన్నెముక

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : కష్టాల్లో పేదలకు వెన్నుదన్నుగా ఆలంబనగా నిలుస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఎంపి నామా నాగేశ్వరరావు గొప్ప మానవతావాది అని వైరా శాననసభ్యులు లావు డ్యా రాములు నాయక్ పేర్కొన్నారు. బీఆర్‌ఎన్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో వైరా, అశ్వారావుపేట, మధిర, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాలకు చెందిన 57 మందికి మంజూరైన రూ.22, 51,500 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను గురువారం ఖమ్మం ఎంపి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే నల్లమల, కూరాకులతో కలసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ మానవత్వం పరిమళించిన గొప్ప నాయకుడు ఎంపీ నామా అని కొనియాడారు. ప్రజల ఆశీర్వాదంతో మంచి మెజార్టీతో గెలిపించి, పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా కడిగిపారేస్తున్నారని అన్నారు. అనంతరం తొలుత సాయిచంద్ మృతికి సంతాపం తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, డిసిసిబి ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, ఎంపి క్యాంప్ కార్యాలయం ఇంచార్జి కనకమేడల సత్యనారాయణ, వైరా జెడ్‌పిటిసి నంబూరి కనకదుర్గ, పార్టీ వైరా, కొణిజర్ల, బోనకల్ మండల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, చిరంజీవి, చేబ్రోలు మల్లిఖార్జునరావు,టీఏసీ సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్, నాయకులు పోట్ల శ్రీనివాసరావు, చెరుకుమల్లి రవి, మాధవరావు, తన్నీరు రవికుమార్, బంధం శ్రీనివాసరావు, ఉద్దండు, జి. మాధవరావు, మచ్చా బుజ్జి, బత్తుల శ్రీనివాసరావు, డేగల ఉపేందర్, చింతకాని మండలం గాంధీనగర్ సర్పంచ్ కె. లలిత, సోషల్ మీడియా వైరా ఇన్చార్జి ఎన్.నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News