Sunday, December 22, 2024

పేదల ఆత్మ బంధువు ఎంపి నామా

- Advertisement -
- Advertisement -
  • తెలంగాణ జాతిపిత కెసిఆర్‌కు అండగా ఉండాలి
  • దశాబ్ది ఉత్సవాలను ఘనంగా కొనియాడాలి
  • సింఎఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే రాములు నాయక్, రైతుబంధు జిల్లా కన్వినర్ నల్లమల వెంకశ్వర్లు

వైరా : పేదల ఆత్మబంధువు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు అని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. గురువారం వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపి నామా నాగేశ్వరరావు చొరవతో మంజూరైన సియంఆర్‌ఎఫ్ నిధులు 7 లక్షల 88 వేల 500 రూపాల విలువైన చెక్కులను ఎమ్మెల్యే, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకశ్వరరావు చేతుల మీదుగా లభ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మద్దెల రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైరా నియోజకవర్గ పరిధిలోని 24 మంది లభ్ధిదారులకు సీయం కెసిఆర్ ఆర్ధికంగా ఆదుకున్నారన్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పధకాలను ప్రజల అభివృద్ధికై ప్రవేశ పెట్టి వారి అభివృద్ధికి భాటలు వేస్తున్నారని అన్నారు. ఎంపి నామా ఆధ్వర్యంలో జిల్లా అన్ని రంగాల్లో ముందుందన్నారు. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులను, కార్యకర్తలను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం జిల్లా రైతుబంధు కన్వినర్ నల్లమల వెంకశ్వర్లు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి రైతులను ఆదుకున్న ఘనత సీయం కెసిఆర్‌దేనన్నారు. రైతుపక్షపాతి సీయం కెసిఆర్‌అని, సీయం కెసిఆర్‌ను మూడోసారి సీయంను చేయాలన్నారు.

వైరా నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి వైరాలో బిఆర్‌ఎస్ జెండా ఎగరేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, ఎయంసి చైర్మన్ రత్నం, ఎంపిపి వేల్పుల పావని, జడ్పీటిసీ నంబూరి కనకదుర్గ, దిశా కమిటీ సభ్యుడు కట్టా కృష్ణార్జునరావు, వనమా విశ్వేశ్వరరావు, మచ్చా వెంకశ్వరావు, కాపా మురళీకృష్ణ, వైరా నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ పెరుమాళ్ళ కృష్ణమూర్తి, బానోత్ సక్కుబాయి, రామాలయం చైర్మన్ నమిట్టపల్లి సత్యంబాబు, అజ్మీర వీరన్న, మోటపొతుల సురేష్, వైరా నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News