Monday, December 23, 2024

ఖమ్మం సభ సక్సెస్ ఘనత హరీష్‌దే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అందరి సమన్వయం, సహకారంతో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతంగా బిఆర్‌ఎస్ భారీ బహిరంగ సభను ఖమ్మం లో అత్యంత ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావును ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావు అభినందించారు. పార్లమెంటరీ స్థాయి సంఘం అధ్యయన పర్యటన ముగించుకొని బుధవారం హైదరాబాద్ చేరుకున్న ఎంపి నా మా హరీశ్ రావును కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపి నా మా మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఆదేశాలతో హరీశ్ రావు ఖమ్మం చేరుకొని, సభ ముగిసేంత వరకు జిల్లా ప్రజల మధ్యలోనే ఉంటూ సభ విజయవంతానికి దగ్గరుండి, ఏర్పాట్లు చేశారని నామా గుర్తు చేశారు.

పం డుగ రోజుల్లో కూడా హరీష్‌రావు ఖమ్మంలోనే మకాం వేసి, సభ ఏర్పాట్లను పర్యవేక్షించారని నామా తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పర్యటించి, నాయకులను ఏక తాటి పైకి తీసుకొచ్చి, జన సమీకరణ చేయించి, ఊహించిన దానికంటే మిన్నగా సభను విజయవం తం చేయించిన ఘనత హరీశ్ రావుకే దక్కుతుందని నామా తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులను, మంత్రులను నిద్ర పోనివ్వకుండా సభ విజయవంతానికి హరీష్‌రావు అహర్నిశలు శ్రమించారన్నారు. ఆయన కృషి, పట్టుదల, శ్రమ ఫలితంగానే యావత్ దేశం అబ్బురపడేలా సభ సక్సెస్ చేసుకోగలిగామని నామా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News