Monday, December 23, 2024

అసంతృప్తులకు బుజ్జగింపులు షురూ!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎన్నికల కదన రంగానికి మిగిలిన పార్టీలకంటే ముందుగానే సమర శంఖం పూరించిన బిఆర్‌ఎస్ పార్టీలో నెలకొన్న అసంతృప్తులను బుజ్జగించడానికి పార్టీ అధిష్టానం శ్రీకారం చుట్టింది. ఈమేరకు మేరకు టికెట్ రాని ఆశావహులకు తగిన సమయంలో వారికి న్యాయం చేస్తామన్న సందేశాలను వారికి పంపిస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగించడానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి పాలేరు నియోజక వర్గం నుంచి టికెట్ ఆశించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బుజ్జగించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంపి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ఎమ్మెల్యే నల్లమోతుభాస్కరావును ఆయన వద్దకు పంపారు. బుధవారం నగరంలోని తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి చేరుకున్న నామానాగేశ్వరరావు, ఎమ్మెల్యే భాస్కరరావు దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. అదే విధంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య నివాసానికి ఎమ్మెల్సీ పల్లారాజేశ్వరరెడ్డి వెళ్లి చర్చలు జరిపారు.

విజయమేధ్యేయంగా:
ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ ఆలోచించే మొదటి జాబితా విడుదల చేశారని, కొన్ని కారణాల వల్ల కొందరికి ఈసారి టికెట్ దక్కలేదని వారు వివరించారు. అంకితభావంతో పార్టీకి పనిచేసిన నేతలను అధిష్టానం గుర్తుంచుకుంటుందని, టికెట్ రాలేదని ఆశావహులు చింతించాల్సిన అవసరం లేదని సర్ధి చెబుతున్నారు. మొదటి జాబితా విడుదల చేసిన సమయంలో కూగా ముఖ్యమంత్రి కెసిఆర్ టికెట్ దక్కని వారు ఎవరూ నిరాశకు గురి కావద్దని అన్నారు. వారికి పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే తగిన గౌరవం కల్పిస్తామని అన్నారు. బిఆర్‌ఎస్ క్రమ శిక్షణ గల పార్టీ అని చెప్పిన కేసీఆర్ ఎవరూ పార్టీ లైన్ దాటరనే నమ్మకంతో ఉన్నట్టు తెలిపారు. అసంతృప్తులు ఎవరూ నిరావ పడవద్దని చెప్పారు. ఈనేపద్యంలో చాలా నియోజక వర్గాల్లో టికెట్ ఆశించి భంగపడిన వారు కూడా ఒకరిద్దరు తప్ప మిగిలిన వారెవరూ తమ అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించలేదు.

ఆఖరు నిమిషం వరకూ వేచిచూస్తా:
ఎమ్మెల్యే, ఎంపీ పదవులే రాజకీయాలు కాదని, మిగిలిన ఎన్నో పదవులు వుంటాయని కెసిఆర్ అన్నారు. అయితే టికెట్ దక్కని 7 నియోజక వర్గాల ఎమ్మెల్యేలనే కాకుండా మిగిలిన నియోజక వర్గాల్లోనూ ఆశావహులను బుజ్జగించడానికి కేసీఆర్ తన దూతలను పంపి వారిని సర్ధిచెబుతున్నారు. దీంతో చాలా నియోజక వర్గాల్లో ఇప్పటికే అసంతృప్తి చల్లారని కొన్నిచోట్ల మాత్రం ఇంకా అది కొనసాగుతోంది. అయితే మొదటి జాబితా విడుదల చేసిన సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర అవసరమైతే పరిస్థతులను బట్టి మార్పులు చేర్పులు జరుగుతాయని అన్నారు. దీంతో చాలా నియోజక వర్గాలో టికెట్‌లను ఆశించిన ఆశావహులు కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News