Friday, December 20, 2024

దేశానికి ఆశా కిరణం కెసిఆర్.. కలకాలం జీవించాలి: ఎంపి నామా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరావుకు లోక్‌సభలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకుడు నామా నాగేశ్వర్‌రావు హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. రేపటి నవీన భారతాన్ని నిర్మించేందుకు ముందుకు సాగుతున్న కెసిఆర్‌కు యావత్ తెలంగాణ సమాజం వెన్నుదన్నుగా నిలుస్తుందని నామా పేర్కొన్నారు.

కెసిఆర్ సమర్థ నాయకత్వానికి దేశమంతా మద్దతు లభిస్తుందన్నారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్న దేశ్‌కి నేత అలుపెరుగని నాయకుడు కెసిఆర్ అని అన్నారు. దేశ ప్రజలకు ఆయన ఆశాకిరణంలా కనిపిస్తున్నారని చెప్పారు. భారత్‌ను అగ్రదేశంగా నిలిపే వ్యూహాత్మక ప్రణాళికలు కెసిఆర్ సొంతమన్నారు.

తెలంగాణ పథకాలు దేశమంతా అమలు జరపాలని కోరుకుంటూ బిఆర్‌ఎస్‌ను విశ్వసిస్తూ, ఆదరిస్తూ, అక్కున చేర్చుకుంటున్నారన్నారు. కేవలం 8 ఏండ్లలో దేశంలో అత్యధిక వృద్ధిరేటు సాధించిన 4వ రాష్ట్రంగా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రంగా, పారిశ్రామిక, ఐటి, రియల్ ఎస్టేట్ రంగాల్లో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణాను తీర్చిదిద్దారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News