Monday, December 23, 2024

తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేకే: నామ నాగేశ్వరరావు

- Advertisement -
- Advertisement -

TRS MPs Protest near Gandhi Statue in Parliament

హైదరాబాద్: భాజపా నేతలు తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని తెరాస లోక్​సభా పక్షనేత నామ నాగేశ్వరరావు మండిపడ్డారు. కోట్లాది తెలంగాణ ప్రజల పోరాటాన్ని ప్రధాని మోడీ అవమానించారని పార్లమెంటులో గాంధీ విగ్రహం వద్ద తెరాస ఎంపీల నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని వ్యాఖ్యలను ఖండిస్తూ ఆందోళనకు దిగారు. చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడారని మండిపడ్డారు. ఎన్డీఏ 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడే తెలంగాణను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఈ 8 ఏళ్లలో భాజపా సర్కార్ తెలంగాణకు ఏమైనా చేసిందా అని నిలదీశారు. ఈ సందర్భంగా నమా నాగేశ్వర రావు మాట్లాడుతూ..”భాజపా నేతలు తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు. పార్లమెంటు సాక్షిగా ఏర్పడిన తెలంగాణను అవమానిస్తున్నారు. దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతోంది. తెలంగాణ సాధించడానికి కేసీఆర్‌ 17 ఏళ్లు పోరాడారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్‌ ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలంతా రోడ్లమీదకు వచ్చి ఉద్యమించారు. కోట్లాది తెలంగాణ ప్రజల పోరాటాన్ని మోదీ అవమానించారు” అని నమా నాగేశ్వర రావు పేర్కొన్నారు.

MP Nama Nageswara Rao denies PM Modi’s comments

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News