Sunday, December 22, 2024

కేంద్రంపై నామా మండిపాటు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : తెలంగాణలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న తీవ్ర వివక్ష పట్ల బిఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ఐదేళ్లలో తెలంగాణలో ఒక్క కేంద్రీయ విద్యాలయాన్ని కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదని ఎంపి నామా కేంద్రాన్ని లిఖితపూర్వకంగా ప్రశ్నించారు. గత ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా ఎన్ని కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేశారు? రెగ్యులర్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయో తెలియజేయాలని కోరగా అందుకు కేంద్ర విద్యా శాఖా మంత్రి ఇచ్చిన సమాధానం సక్రమంగా లేదని అన్నారు. కేంద్రం గత ఐదేళ్లలో తెలంగాణాలో ఒక్క కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయలేకపోయిందని నామా చెప్పారు.

2018/19 నుంచి నేటి వరకు తెలంగాణలో ఒక్క కేంద్రీయ విద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయలేదన్నారు. 2018-/19లో కేవలం రెండు కేంద్రీయ విద్యాలయలను మాత్రమే మంజూరు చేశారన్నారు. 2018/19లో దేశ వ్యాప్తంగా 16 , 2019/20లో 36, 2020/21లో 10, 2021/-22లో 3, 2022/23లో ఐదు కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభించి, తెలంగాణను పూర్తిగా విస్మరించడమేమిటని ప్రశ్నించారు. కేంద్రీయ విద్యాలయాల్లో పోస్టులు భర్తీ చేయకపోవడంతో పెద్ద ఎత్తున ఖాళీలు పేరుకుపోవడం వల్ల విద్యా బోధనపై ప్రభావం పడుతుందన్నారు. ఇప్పటి వరకు టీచింగ్‌కు సంబంధించి 13, 562 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, నాన్ టీచింగ్ పోస్టులు 1772 వరకు ఉన్నాయని చెప్పారు.

ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఖాళీ పోస్టుల భర్తీ చేయడంతో పాటు తెలంగాణలో నూతనంగా కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేసి, పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు విద్యను అందుబాటులో ఉంచాలని నాగేశ్వరరావు ఎంపి నామా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కొత్త వాటిని ఏర్పాటు చేయకుండా, ఉన్న ఖాళీలు భర్తీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నామా పేర్కొన్నారు. కేంద్ర విద్యా శాఖా మంత్రి అన్నపూర్ణా దేవి సమాధానం ఇస్తూ ఖాళీల భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News