Monday, January 20, 2025

తెలంగాణపై ఎందుకింత కక్ష..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంట్ సమయంలో అనేక సార్లు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పామని, ఇవ్వాల్సినవి 8 ఏళ్ల నుంచి ఇవ్వకుండా పెడచెవిన పెడుతున్నారని కేంద్రం ప్రభుత్వంపై టిఆర్ఎస్ లోక్ సభ సభ్యుడు నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఎంపి నామా మాట్లాడుతూ.. ఈరోజు నవోదయ విద్యాలయాల అంశంపై రాజ్యసభ, లోక్ సభల్లో వాయిదా తీర్మానం ఇచ్చాము. వాయిదా తీర్మానం పై చర్చించాలి.. తెలంగాణకు అన్యాయ జరుగుతుందిని చెప్పాము. ధ్యానం కొనుగోలు, ఎస్టీ రిజర్వేషన్లు, నిరుద్యోగం, నవోదయ విద్యాలయాల లేవనెత్తాము. రాష్ట్ర సమస్యలపై అవకాశం ఇవ్వడం లేదని వాకౌట్ చేసాం. కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో తెలంగాణ కు అన్యాయం చేస్తున్న విషయాన్ని అందరూ గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అన్ని పనులు చేస్తోంది. కేంద్రం మాత్రం ఏమి చేయడం లేదు. జిల్లాకొక నవోదయ విద్యాలయం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ప్రస్తుతం 9 నవోదయ విద్యాలయాలు మాత్రమే ఇచ్చారు.. ఇంకా 23 ఇవ్వాల్సి ఉంది. 8 ఏళ్ల నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేసాం. పార్లమెంట్ లో లేవనెత్తాము, ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ రాసారు.. కలిసి విజ్ఞప్తి చేశారు. 33 జిల్లాలకు 33 నవోదయ విద్యాలయాలు ఇవ్వాల్సిందే. 7 ఐఐఎంలు.. 4 ఎంఐటీలు.. 16 ఐఐటీలు, 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. ఇందులో తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు. తెలంగాణపై కేంద్రం అక్కసు ఏ విధంగా ఉందో తెలుస్తోంది. మా కంటే చిన్న రాష్ట్రాలకు అస్సాంలో 27, గుజరాత్ లో 31, హర్యానాకు 21, హిమాచల్ ప్రదేశ్ కు 17, మణిపూర్ లో 11, త్రిపురలో 7 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. భారత దేశంలో తెలంగాణ లేదా..?, మా తెలంగాణ బిడ్డలు భారత బిడ్డలు కాదా?. ఎందుకు ఇంత అన్యాయం. కేరళ తర్వాత బాగా చదువుకున్న విద్యార్థుల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. 5 ఏళ్లలో 80 నవోదయ విద్యాలయాలు ఇచ్చారు. తెలంగాణకు మాత్రం జీరో. ఎందుకు ఇంత కక్ష, విషం ఎందుకు క్కాక్కుతున్నారు. తెలంగాణ బిడ్డల ఓట్లతో పార్లమెంట్ కు వచ్చిన ఎంపిలను అడుగుతున్నాం. ఎందుకు తెలంగాణ ప్రజల సమస్యలపై మాట్లాడడం లేదు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన ఎంపిలను అడుగుతున్నా. తెలంగాణ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు. కనీసం నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చే బాధ్యత లేదా?.చేతనైతే పెండింగ్ లో ఉన్న నవోదయ విద్యాలయాలు ఒక నెలలో తీసుకురండి. చెప్పండి తీసుకొచ్చాం అని.. దండెసి దండం పెడుతం. తెలంగాణకు న్యాయం జరిగే వరకు అన్ని అంశాలపై పోరాటం చేస్తాం. గిరిజన రిజర్వేషన్లపై స్పష్టంగా తీర్మానం పంపించాము. వాళ్ళ తప్పులు బయటకు వస్తున్నాయని ఏదో చెబుతున్నారు అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

MP Nama Nageswara Rao press meet in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News