Wednesday, January 22, 2025

అదానీ అంశంపై దద్దరిల్లిన పార్లమెంట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మూడో రోజు కూడా అదానీ వ్యవహారంపై పార్లమెంట్ దద్దరిల్లింది. అదానీ వ్యవహారంపై తక్షణమే జేపీసీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్, వివక్ష ఎంపీలు గట్టిగా పట్టుబట్టడంతో పార్లమెంట్ కార్యకలాపాలు స్తంభించాయి. దాంతో లోక్ సభ, రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగింది. ఈ క్రమంలో తాజాగా 18 ప్రతిపక్ష పార్టీలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ముట్టడించేందుకు యత్నించాయి. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష నేతలపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా దాడులు చేయిస్తుందని, అదానీ లాంటి వ్యాపార వేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ తో సహా 18 ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పాత, కొత్త పార్లమెంట్ మధ్యలోకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అ

దానీ వ్యవహారంపై తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి, నిజాలను నిగ్గు తేల్చాల్చిందేనంటూ పెద్ద పెట్టున నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పార్లమెంట్ నుంచి ఢిల్లీలోని ఈడీ ఆఫీస్కు కాలినడకన బయల్దేరారు. ర్యాలీలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఉదయం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఎంపీలు ఆ తర్వాత పార్లమెంట్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఎంపీలు, వివక్ష నేతల ర్యాలీని దృష్టిలో ఉంచుకుని ఈడీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ర్యాలీకి అనుమతి లేకపోవడంతో వారి ర్యాలీని ఢిల్లీ పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. పార్లమెంట్ నుంచి బయటకు వచ్చిన నేతలను విజయ్ చౌక్ లోనే నిలువరించారు.

అయితే బారికేడ్ల ఏర్పాటు, భారీ స్థాయిలో బలగాల మోహరింపులతో ప్రతిపక్ష నేతల ర్యాలీని అడ్డుకున్నా తర్వాత లోక్ సభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు, కాంగ్రెస్ నేత ఖర్గే నేతృత్వంలో ఈడీ ఎస్కే మిశ్రాను కలిసి,లేఖను అందజేశారు. అదానీ లాంటి వారిపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని, దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ఈ సందర్భంగా లేఖలో ఈడీని కోరామని నామ చెప్పారు. ఇది ఎంతో పెద్ద కుంభకోణం.. ఆ గ్రూప్ లో ఎల్ఐసి, ఎస్బీఐ,ఇతర బ్యాంకుల పెట్టుబడులు ఉన్నాయని, ప్రభుత్వ ఆస్తుల కొనుగోలుకు ప్రభుత్వం ఒక వ్యక్తికి డబ్బు ఇస్తోంది.. గతంలో కొద్దిపాటి వ్యాపారాలు ఉన్న వ్యక్తి అనూహ్యంగా రూ.13 లక్షల కోట్లకు ఎలా ఎగబాకాడని, ఇది ఎలా సాధ్యం ? ఎవరు డబ్బు ఇస్తున్నారు..

మోదీకి, అదానీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటీ? అని లేఖలో ప్రస్తావించినట్లు నామ తెలిపారు. బీఆర్ఎన్, ప్రతిపక్ష నేతల గళాన్ని కేంద్రం అణచివేస్తున్నదని నామ ఆవేధన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం బేషజాలకు పోకుండా తక్షణమే అదానీ అంశంపై జేపీసీని వేసి, వాస్తవాలను ప్రజల ముందుంచాలని నామ కోరారు. ప్రతిపక్షనేతలపై కావాలని దర్యాప్తు సంస్థల్ని పంపించడం సరికాదని, కేంద్రం తీరు మార్చుకోవాలన్నారు. అదానీ -హిండెన్ బర్గ్ అంశంపై దర్యాప్తు కోసం బీఆర్ఎస్, వివక్ష పార్టీలు పట్టుబడుతున్నా ఎందుకు వెనక్కిపోతున్నారని నామ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News