Thursday, January 23, 2025

నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ ప్రకటించాలి : ఎంపి నామా

- Advertisement -
- Advertisement -

ఖమ్మం  : చేనేత కార్మికులకు సంబంధించి నేషనల్ హ్యాండ్లూమ్ ఫాలసీ ప్రకటించాలని బిఆర్‌ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం న్యూఢిల్లీలోని కానిస్ట్యూషన్ క్లబ్ లో అఖిల భారత పద్మశాలి సంఘం హ్యాడ్లూమ్ విభాగ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపి నామా ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. చేనేత కార్మిక కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని అన్నారు. చేనేతల అభివృద్ధి కి తెలంగాణ సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ఎన్నో ప్రోత్సాహాకాలు ఇస్తూ ఆ రంగం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటీషిస్తూ కృషి చేస్తున్నారని అన్నారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరడంతో పాటు పోచంపల్లిలో మూతబడిన చేనేత పార్క్ ను తిరిగి ఏర్పాటు చేసేందుకు కెటిఆర్ కేంద్రానికి పలు లేఖలు రాసిన సంగతిని నామా గుర్తు చేశారు. తాను రైతు బిడ్డనని, చిన్నతనంలో తన తల్లిదండ్రులు చేనేత వస్త్రాలనే ధరించే వారని నామా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News