- Advertisement -
అమరావతి: రాజధానుల్లో టాప్-5లో అమరావతి ఉండాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారని ఎపి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణంపై ఈరోజు అసెంబ్లీలో ప్రకటన చేశారు. నిర్మాణం 2028 నాటికి పూర్తవుతుందని తెలిపారు. గత ప్రభుత్వం రాజధానిపై మూడు ముక్కలాట ఆడిందని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి రూ.64,721 కోట్ల ఖర్చవుతుందని వెల్లడించారు. ప్రధానరోడ్లు రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. మూడేళ్లలో ఎల్బీఎస్ రోడ్లు, ఏడాదిన్నరలో అధికారుల భవనాలు పూర్తి చేస్తామన్నారు. మూడేళ్లలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. గతంలో అమరావతిలో 131 సంస్థలకు 1,277 ఎకరాలు కేటాయించామని పేర్కొన్నారు. గత ఐదేళ్లలోని పరిణామాల దృష్ట్యా కొన్ని సంస్థలు వెనక్కెళ్లాయని మంత్రి నారాయణ దుయ్యబట్టారు.
- Advertisement -