- Advertisement -
అమరావతి: రేపు ఇ- చెక్ థీమ్ తో స్వచ్ఛాంధ్ర- స్వచ్ఛ దివస్ నిర్వహణ జరుగుతుందని ఎపి మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లతో నారాయణ టెలికాన్ఫరెన్స్ జరిపారు. 4 నెలలుగా స్వచ్ఛాంధ్ర దివస్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర- స్వచ్ఛ దివస్ నిర్వహణ జరుగుతుందని తెలిపారు. దుకాణాలు, ఇళ్లలో ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించాలని చెప్పారు. మున్సిపాలిటీల్లోని ఆర్ఆర్ఆర్ సెంటర్లను ఈ-కలెక్షన్ సెంటర్లుగా మార్చి..మెప్మా మహిళలకు అప్పగించాలని నారాయణ పేర్కొన్నారు.
- Advertisement -