- Advertisement -
ముంబై: వీరసావర్కర్‌పై తన వ్యాఖ్యలను తప్పుతోవ పట్టించి అబద్ధాలు ప్రచారం చేసి తన వ్యక్తిగత పరువు మర్యాదలకు పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆరోపిస్తూ బిజెపి ఎంఎల్‌ఎలు ఆశిష్ షెలార్, అతుల్ భట్కాల్కర్‌లతోపాటు గాయకుడు భరత్ బాలవల్లికి లీగల్ నోటీసు పంపినట్టు శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది వెల్లడించారు. వీరి నుంచి ఆమె క్షమాపణ కోరారు. వారు అలా చేయకుంటే క్రిమినల్ , సివిల్ చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. దీనికి బిజెపి ఎంఎల్‌ఎ భట్‌ఖాల్కర్ స్పందిస్తూ చతుర్వేది వంటి వారి నుంచి మరో 10 లీగల్ నోటీసులనైనా అందుకోడానికి సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు.
- Advertisement -