Thursday, January 23, 2025

అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు: ఎంపీ పురందేశ్వరి

- Advertisement -
- Advertisement -

హీరో అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని బిజెపి ఎంపి దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. నిన్న తెలంగాణ అసెంబ్లీలో అల్లుఅర్జున్, సినీ ప్రముఖులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సిఎం రేవంత్ వ్యాఖ్యలపై ఇప్పటికే బిఆర్ఎస్, బిజెపి నేతలు తప్పుబట్టారు. తాజాగా ఈ వివాదంపై ఎంపి ఎంపీ పురందేశ్వరి స్పందించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రేరేపించింది కాదని, అనుకోకుండా జరిగిన ఘటన అని అన్నారు. ఈ కేసులో ఇతరులను అరెస్ట్ చేయకుండా, ఎ11గా ఉన్న అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం ఏమాత్రం సరికాదని ఎంపి పురందేశ్వరి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News