Sunday, December 22, 2024

జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఏం జరిగిందో ప్రజలకు తెలియాలి: రఘునందన్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌ దందా జరుగుతోందని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. వీకెండ్ వచ్చిందంటే హైదరాబాద్ నగరంలో రేవ్ పార్టీలతో రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఏం జరిగిందో ప్రజలకు ప్రభుత్వం తెలియజేయాలని డిమాండ్ చేశారు.

పోలీసులే కొంతమంది పెద్దలను పంపినట్లు తెలుస్తుందని చెప్పారు. రేవ్‌పార్టీలో వీఐపీల పిల్లలున్నారని వార్తలొచ్చాయని, ఫామ్ హౌజ్ లో సీసీటీవీతోపాటు చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్‌ విడుదల చేయాలన్నారు. సీఎం రేవంత్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బిఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని అనుమానం ఉందని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు.

కాగా, జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు శనివారం అర్దరాత్రి దాడులు చేసి 42 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనధికారికంగా విదేశీ మద్యం, అనుమతి లేకుండా రేవ్ పార్టీ నిర్వహించినందుకు కెటిఆర్ బావమరిది రాజ్ పాకాలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News