Thursday, December 19, 2024

బిఆర్‌ఎస్ కన్నా అధ్వాన పరిస్థితిలో కాంగ్రెస్ పాలన:ఎంపి రఘునందన్‌రావు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో బిఆర్‌ఎస్ పాలన కన్నా అధ్వాన పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉందని బిజెపి మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఘాటుగా విమర్శించారు. మార్పు కావాలి అని గొప్పగా చెప్పి ఏం మార్పు తెచ్చారని ఆయన ప్రశ్నించారు. గవర్నమెంట్ హస్టళ్లలో జరుగుతున్న ఘటనలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన సాంబారులో ఎలుక, మోడల్ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్ధులకు అస్వస్థత అంటూ పలు దిన పత్రికల్లో వచ్చిన కథనాలను పోస్ట్ చేశారు. ప్రభుత్వ హాస్టళ్లు ఇంకా అధ్వాన్న పరిస్థితికి చేరుకున్నాయని రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు.

మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కానీ ఏం మార్పు తెచ్చారని ఆ ట్వీట్‌లో ప్రశ్నించారు. ఆనాటి బీఆర్‌ఎస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి పురుగుల అన్నం, నీళ్ల చారులా ఉండేదని, నేడు కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. వారం రోజులో నాలుగు సంఘటనలు చోటు చేసుకున్నాయని, ఈ విషాహారం తిని బలి అవుతున్న విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. అలాగే అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే విద్యార్థులకు ఈ అవస్థ అని పేర్కొన్నారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News