Sunday, December 22, 2024

ఎంపి రఘురామ కస్టోడియల్ టార్చర్‌పై హైకోర్టులో విచారణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎంపి రఘురామ కస్టోడియల్ టార్చర్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సిఐడి కోర్టు ఆదేశాలతో గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో జరిగిన వైద్య పరీక్షల నివేదికలను భద్రపరిచాలని పిటిషన్ వేశారు. లాయర్ వి. వి లక్ష్మీనారాయణ రఘురామ తరపున వాదించారు. కార్డియాలజీ, జనరల్ మెడిసన్, రేడియాలజీకి చెందిన వైద్యుల నివేదికలను భద్రపరచాలని న్యాయవాది కోరారు.

Also Read: రేపే లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్

రెండేళ్లు పూర్తి కావడంతో నివేదికలను ధ్వంసం చేసేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతి కోరినట్లు కోర్టుకు లాయర్ తెలిపారు. అలా చేస్తే కీలక ఆధారాలు మాయమైపోతాయని లాయర్ పేర్కొన్నారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ఎంఇడి, ఆరోగ్య శాఖ కమిషనర్‌ను ఎపి హైకోర్టు ఆదేశించింది. లిఖిత పూర్వక కౌంటర్‌లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేయాలని కోర్టు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News