కాంగ్రెస్ నేత, ఎంపి రాహుల్ గాంధీ కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పట్ల పెద్ద మనసు చూపారు. దయచేసి ఎవరూ కూడా ఆమె పట్ల తప్పుడు వ్యాఖ్యలకు దిగరాదని, నాస్టీగా ఉండరాదని సామాజిక మాధ్యమంలో పిలుపు నిచ్చారు. ఇరానీ 2019 లోక్‌సభ ఎన్నికలలో ఇరానీ అమేథీలో రాహుల్‌ను ఓడించారు. అయితే ఈసారి ఎన్నికల్లో అమేధీలో ఓటమి పాలయ్యారు. ఎన్నికలల్లో గెలుపోటములు సహజం అని, ఇది జీవితంలోనే జరుగుతున్నప్పుడు రాజకీయాల్లో సర్వసాధారణం అని రాహుల్ స్పందించారు. అమేథీ నుంచి ఓడిన ఇరానీ తన అధికారిక నివాసం ఖాళీ చేసిన దశలో సామాజిక మాధ్యమంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో రాహుల్ స్పందించారు.
స్మృతి ఇరానీ పట్లనే కాకుండా ఆ మాటకొస్తే ఏ నేత పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలకు దిగరాదని ఆయన కోరారు. ఇతరులను అమమానించడం, వేధించడం అనేవి నిజానికి వీటికి పాల్పడ్డ వారి బలహీనతలను చాటుతాయి తప్పితే బలాన్ని కాదని వివరించారు. రాహుల్ ఇప్పుడు ఇరానీ పట్ల ఎందుకు ఇంత ఔదార్యతను చాటారనేదానికి సరైన కారణం పలు ఊహాగానాలకు దారితీసింది. అయితే ఇదంతా కూడా ఆయన తరచూ చెపుతోన్న మెహబ్బత్ కీ దుకాణ్ వైఖరి, రాజకీయాలలో కొత్త బ్రాండ్‌కు తార్కాణమని కాంగ్రెస్ పార్టీ వారు అభిప్రాయపడ్డారు.