- Advertisement -
శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి తెలిపారు. చేవెళ్ళ ఎంపీ అభ్యర్థిగా తనను పోటీ చేయమని కెటిఆర్ చెప్పారని పేర్కొన్నారు. రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పని చేయాలని కెటిఆర్ దిశానిర్దేశం చేశారని అన్నారు. తెలంగాణ అంటేనే బిఆర్‌ఎస్ అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, అయితే ఏమీ చేయలేదని కాంగ్రెస్ చెప్పడం అసత్యమని ఆక్షేపించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలో బిఆర్‌ఎస్‌కు శాసనసభ ఎన్నికల్లో లక్షా తొమ్మిది వేల మెజారిటీ వచ్చిందని, ఎంపి ఎన్నికల్లో అంత కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ఖాళీ అవుతుందని కాంగ్రెస్, బిజెపి పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
- Advertisement -