Friday, January 10, 2025

రేవంత్ రెడ్డి పై మండిపడ్డ ఎంపి రంజిత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిజెపి నుంచి ప్రధాని నరేంద్ర మోడీయే స్వయంగా చేవెళ్ళ నుంచి బరిలో నిలిచినా బిఆర్‌ఎస్ నుంచి తానే బరిలో ఉంటానని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాబోయే ఏ ఎన్నికల్లో అయినా తాము బిజెపి, కాంగ్రెస్‌కు సమ దూరంలో ఉంటామని పునరుద్ఘాటించారు.

ఇదే తమ పార్టీ విధానమని స్పష్టం చేస్తూ తాము ఎవ్వరి కోసం సిట్టింగ్ సీటును త్యాగం చేయమని వెల్లడించారు. రేవంత్‌రెడ్డియే స్వయంగా అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పారన్నారు. దాంతో ఆయన మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. కేవలం తమ చేవెళ్ళ నియోజకవర్గ ఓటర్లను పక్కదారి పట్టించేందుకు రేవంత్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. ఇటువంటి వ్యాఖ్యలు చేవెళ్ళ ప్రజలు ఏమాత్రం పట్టించుకోరన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News