Sunday, January 19, 2025

మంత్రి కొండా సురేఖతో ఎంపి రంజిత్ రెడ్డి భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని శనివారం హైదరాబాద్ లోని వారి నివాసంలో ఎంపి రంజిత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై ప్రజలకు నానాటికీ పెరుగుతున్న నమ్మకం, క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్న తీరును ఎంపి రంజిత్ రెడ్డి మంత్రికి వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News