Wednesday, December 25, 2024

బిఆర్‌ఎస్‌కు ఎంపి రంజిత్‌రెడ్డి రాజీనామా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్‌కు చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. అతి త్వరలో కాంగ్రెస్‌లో రంజిత్ రెడ్డి చేరనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేశానని ఎంపి రంజిత్ రెడ్డి వివరణ ఇచ్చారు. చేవెళ్లకు సేవ చేసే అవకాశమిచ్చి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నానని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్‌లో సహకరించిన ప్రతి ఒక్కరికీ రంజిత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News