Monday, December 23, 2024

మొక్కలు నాటిన ఎంపి రంజిత్ రెడ్డి సతీమణి

- Advertisement -
- Advertisement -

MP Ranjith Reddy wife plant tree

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి ఆర్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిగి కళాశాలలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎంపి రంజిత్ రెడ్డి సతీమణి సీతా రెడ్డి మొక్కలు నాటి ప్రారంభించారు.  మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు, ప్రజలందరూ మొక్కలు నాటి వాటిని రక్షించాలని సీతారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఎల్ఎ మహేశ్ రెడ్డి సతీమణి ప్రతిమ రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, స్థానిక జడ్పిటిసి పట్లొల హరి ప్రియ, నియోజక వర్గ టిఆర్ఎస్ అధ్యక్షుడు మధుసూధన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News