Sunday, January 5, 2025

గ్రీన్ ఇండియా ఛాలెంజ్… మొక్కలు నాటిన ఎంపి రవిచంద్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు ఎంపి సంతోష్ కుమార్ మొక్కల్ని నాటడంతో పాటు ప్రజలతో నాటించి వాటి పరిరక్షించడాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోతున్నారని ఎంపి రవి చంద్ర ప్రశంసించారు. తన పుట్టినరోజు సందర్భంగా కెబిఆర్ పార్కులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఎంపి వద్దిరాజు రవిచంద్ర మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పర్యావరణ సమతుల్యాన్ని, ప్రకృతిని పరిరక్షించాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవి చంద్ర అన్నారు. మానవాళిని పట్టి పీడిస్తున్న భూతాపాన్ని, వాతావరణ కాలుష్యాన్ని పారదోలేందుకు పెద్ద ఎత్తున మొక్కల్ని నాటడం, నాటించడం, వాటిని పరిరక్షించడం అత్యవసరం అని చెప్పారు.

ఈ విధంగా ఇప్పటివరకు 17కోట్ల మొక్కల్ని నాటించి, వాటిని పరిరక్షిస్తున్న సంతోష్ కుమార్ అభినందనీయులని రవిచంద్ర కొనియాడారు. మొక్కల్ని నాటే కార్యక్రమంలో ఎంపి వద్దిరాజుతో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, కాపునాడు జాతీయ అధ్యక్షులు తాడివాక రమేష్ నాయుడు, మున్నూరు కాపు ప్రముఖులు కొండా దేవయ్య, సర్థార్ పుట్టం పురుషోత్తం రావు, ఆవుల రామారావు, ఉరుమడ్ల నర్సింహా, ఉషా రఘు, గుండ్లపల్లి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెబిఆర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రముఖులు, అటవీ శాఖ సిబ్బంది ఎంపి రవి చంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News