Monday, December 23, 2024

రాష్ట్రం మాదిరిగా దేశం కూడా సుభిక్షంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం మాదిరిగానే భారతదేశం సుభిక్షంగా ఉండాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బల్కంపేట ఎల్లమ్మ తల్లిని వేడుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, సంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆదివారం వద్దిరాజు వంశస్తులు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతర ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్దిలో దూసుకపోతుందని అదే విధంగా దేశం కూడా అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉండాలని, కేసీఆర్ నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా జీవించేలా చూడాల్సిందిగా ఎల్లమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు. తెలంగాణ అన్ని రంగాలలో ప్రగతిపథాన పరుగులు పెడుతుండడాన్ని చూసి కేసీఆర్ సమర్థవంతమైన నాయకత్వం, సుపరిపాలన తమకు కూడా కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటునట్లు చెప్పారు.

ఆలయ ముఖద్వారం వద్ద వద్దిరాజు వంశస్తులకు ఇవో అన్నపూర్ణ, వేదపండితులు,అధికారులు మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి అమ్మ వారి శేష వస్త్రాలు,తీర్థ ప్రసాదాలు బహుకరించి ఆశీర్వదించారు. వీరితో పాటు ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న వారిలో జల వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి.ప్రకాష్, బీఆర్‌ఎస్ నాయకులు సర్థార్ పుట్టం పురుషోత్తం రావు, ఆర్జేసీ కృష్ణ, గుండ్లపల్లి శేషగిరిరావు, ముద్దు వినోద్, మున్నూరు కాపు ప్రముఖులు కనకయ్య, విష్ణు జగతి, తూడి ప్రవీణ్, మరికల్ పోత సుధీర్ కుమార్, పత్తి శ్రీనివాస్, వెంపటి ఉపేందర్, భద్రి గోరెంట్ల, యువ తేజాలు కార్తీక్, నానబాల హరీష్, జెన్నాయి కోడే జగన్మోహన్, గుమ్మడెల్లి హరీష్, జెన్నాయికోడే చంద్రశేఖర్, గుమ్మడెల్లి ప్రశాంత్, ఎంపీ రవిచంద్ర తమ్ముళ్లు మోహన్, పెద్ద వెంకన్న, శ్రీనివాస్, సన్నిహితులు రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సికిందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News