Saturday, November 2, 2024

దేశవాళీ ఆవుల సంరక్షణ సామాజిక బాధ్యత

- Advertisement -
- Advertisement -

MP Santhosh Kumar, Allola Divya Reddy unveiling Save Desi Cows poster

మనతెలంగాణ/ హైదరాబాద్ : సామాజిక బాధ్యతగా దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం దివ్యారెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. క్రాస్ బ్రీడింగ్‌తో దేశంలో అంతరించిపోయే దశకు చేరిన దేశవాళీ ఆవుల సంరక్షణకు తాము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునివ్వాలని సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్ అల్లోల దివ్యారెడ్డి ఎంపి సంతోష్ కుమార్‌ను కోరారు. మంగళవారం ప్రగతి భవన్‌లో సంతోష్‌కుమార్‌ను కలిసి దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలను ఆమె వివరించారు. హైబ్రిడ్ జాతులతో క్రాస్ బ్రీడింగ్ పద్ధతులతో దేశీయ పశుసంపద కనుమరుగైపోకుండా, వాటిని పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు ఈ సంపాదనను అందించాలనే కర్తవ్యంతో సేవ్ దేశీ కౌస్ ప్రచారం చేపట్టినట్లు తెలిపారు.

పర్యావరణ అవగాహన, పచ్చదనం పెంపులో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్, సీడ్ గణేషా లాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దేశవాళీ ఆవుల, పాడి పరిశ్రమ అభివృద్ధికి కూడా చేయూతను అందించాలని ఎంపి సంతోష్‌కుమార్‌ను ఆమె కోరారు. రోగ నిరోధక శక్తిలో, పాల నాణ్యతలో దేశీ ఆవులకు సాటిరాని హైబ్రీడ్ జాతులతో క్రాస్ బ్రీడింగ్ పద్ధతులను అరికట్టిను దేశవాళీ ఆవుల పోషణ వృద్ధి చెందేలా మన రైతులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని దివ్యారెడ్డి విజ్ఞప్తి చేశారు. సామాజిక బాధ్యతగా దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం దివ్యారెడ్డి చేస్తున్న కృషిని ఎంపి అభినందించారు. దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎంపి సంతోష్‌కుమార్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News