Thursday, January 23, 2025

హరిత భారతం.. అందరి లక్ష్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆలోచనలను ఆశయాలుగా మార్చి వాటి సాధనకు కృషి చేయటం ఉద్యమకాలం నుంచి సిఎం కెసిఆర్ ఆచరణలో పెట్టారని, అదే స్ఫూర్తి నుంచి ప్రేరణ పొందుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని రాజ్యసభ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా ములుగు ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ములుగు ఆవరణలో ఎంపి సంతోష్ మొక్క లు నాటారు. ఫారెస్ట్ కాలేజీలో విద్యను అభ్యసిస్తున్న వందలాది మంది విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలు మొక్కలు నాటడం ద్వారా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అంతకుముందు బీడుగా ఉన్న రాష్ట్రాన్ని స్వరాష్ట్ర సాధన తర్వాత హరితమయంగా మార్చాలనే సంకల్పంతో సిఎం కెసిఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని తీసుకున్నారని, దాని నుంచే స్ఫూర్తి పొంది తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

గత ఐదేళ్లుగా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు, అన్ని వర్గాలకు చేరుకోవటం చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో మొక్కలు నాటడం గొప్ప విషయమన్నారు. వేడుక ఏదైనా మొక్క నాటాలనే ఆలోచన ఇప్పుడు ప్రతీ ఒక్కరిలో తీసుకురావడంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొదటి విజయాన్ని సాధించిందని తెలిపారు. తెలంగాణలో హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతం చేసుకుని అదే మాదిరిగా దేశవ్యాప్తంగా ఆకు పచ్చని ఉద్యమం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని, ఆ దిశగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సమాజంలోని అన్ని వర్గాలను మరింతగా భాగస్వామ్యం చేసేలా కృషి చేస్తుందన్నారు. ఇప్పటి దాకా స్వచ్ఛందంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి నవీన్ కుమార్, బిసి కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, ఫారెస్ట్ కాలేజ్ డీన్ ప్రియాంక వర్గీస్, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్స్ కరుణాకర్ రెడ్డి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.

అన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు :ఎంఎల్‌సి కవిత

రాజ్యసభ సభ్యులు సంతోశ్ కుమార్‌కు ఎంఎల్‌సి కవిత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్న’ అంటూ కవిత ట్వీట్ చేశారు.

పర్యావరణాన్ని పరిరక్షించాలి : హోంమంత్రి

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా బుధవారం రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ బంజారాహిల్స్‌లోని తన క్వార్టర్‌లో మొక్క లు నాటారు. ఎంపి సంతోష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఎంపి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశవ్యాప్తంగా చక్కటి పేరు సంపాదించిందని తెలియజేశారు.

బాధ్యత తీసుకోవాలి : ఎంఎల్‌ఎ రేగా కాంతారావు

రాజ్యసభ సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రైటర్ బస్తీ నందు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగ్యస్వామ్యం కావడం ఎంతో సంతోషం.

ఇది పర్యావరణ పరిరక్షణకు ఒక నిజమైన ఛాలెంజ్ ఎందుకంటే ఆక్సిజన్ కేంద్రాలు నెలకొల్పే పరిస్థితి మనకు వచ్చింది అంటే మనం మొక్కలు నాటడం పెంచడం బాధ్యతగా తీసుకోవాలన్నారు, మొక్కలు నాటిన వాటిని సంరక్షించుకోవడం వల్లే నేల తల్లికి అలాగే మన సమాజానికి ఎంతో ఉపయోగకరమని, మనమందరం ఆరోగ్యకరంగా ఉం డాలంటే మొక్కలు నాటడం చాలా అవసరమని కాబట్టి అం దరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు, సిఎం కెసిఆర్ మానస పుత్రిక హరితహారానికి మద్దతుగా గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టి ప్రజల్లో మంచి అవగాహన కల్పిస్తూ చెట్లు నాటే విధంగా ప్రోత్సహిస్తున్నారన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News