Sunday, December 22, 2024

‘నీళ్లు-నిధులు-నియామ‌కాలు’ నినాదం నిజ‌మైంది..

- Advertisement -
- Advertisement -

MP Santosh Kumar About 8039 Govt Vacancies

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ “నీళ్లు-నిధులు-నియమకాలు” అనే ప్రధాన మంత్రంతో ఉద్యమాన్ని నడిపించి స్వరాష్ట్రం సాధించారని ఎంపి సంతోష్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడేండ్ల కాలంలో ఇప్పటికే అనేక నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించి తద్వారా గొప్ప సంపదను సృష్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఇచ్చిన 1 లక్షకు పైగా ఉద్యోగాలు కాకుండా, ఇప్పుడు మరో 91,142 పోస్టుల నోటిఫికేషన్‌ను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసిఆర్ నుండి మరో బహుమతి వచ్చిందని “నీళ్లు- నిధులు- నియామ‌కాల నినాదాలు నిజ‌మయ్యాయని, దేశం అబ్బుర‌ప‌డే స్థాయిలో ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క‌ట‌న వ‌చ్చిందని అన్నారు. ఇది ఉద్యోగ నామ సంవ‌త్స‌రంగా అభివర్ణిస్తూ తెలంగాణ యువ‌త‌కు ఎంపి సంతోష్ కుమార్ శుభాకాంక్ష‌లు తెలియజేశారు.

MP Santosh Kumar About 8039 Govt Vacancies

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News