Sunday, December 22, 2024

ప్లాస్టిక్‌ను త్యజిద్దాం

- Advertisement -
- Advertisement -

ప్లాస్టిక్‌ను త్యజిద్దాం

పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ఎంచుకుందాం
 ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు

మన తెలంగాణ/ హైదరాబాద్: ‘ప్లాస్టిక్‌ను త్యజిద్దాం.. పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ఎంచుకుందాం’ అని రాజ్యస భ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రపంచ పే పర్ బ్యాగ్ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ వీలైనంత వరకూ ప్లాస్టిక్‌ను స్వచ్ఛందంగా వదిలివేయాలని, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

జూలై 12న, ప్లాస్టిక్‌కు బదులు గా పేపర్ బ్యాగ్‌లను ఉపయోగించడం, ప్రా ముఖ్యతను ప్రోత్సహించడానికి ఏటా ప్రపంచ పేపర్ బ్యాగ్ దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. ఈ ఆచారం దైనందిన జీవితంలో ప ర్యావరణ స్పృహతో కూడిన ఎంపికలకు ప్రా ధాన్యత ఇవ్వడానికి రిమైండర్‌గా పనిచేస్తుందని వెల్లడించారు. వ్యక్తులు, వ్యాపారాలను మరింత స్థిరమైన ప్రత్యామ్నాయాలను అనుసరించేలా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News