Sunday, December 22, 2024

ఫోటోగ్రఫీ ఒక భావోద్వేగం: ఎంపి సంతోష్ కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఫోటో గ్రఫీ అంటే ఆర్ట్ అని, ఫోటో సెన్స్ ఉంటే తప్పా మంచి ఫోటోను తీయలేమని బిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినల్లి సంతోష్ కుమార్ అన్నారు. ఫోటో జర్నలిస్టులకోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, అందుకోసం తన ఎంపి నిధుల నుంచి రూ.2 లక్షలను అందజేయనున్నట్లు సంతోష్ కుమార్ తెలిపారు. ఒక మంచి ఫోటో వంద వార్త కథనాలకు సమానం అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ డియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎంఎల్‌ఏ క్రాంతి కిరణ్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్‌లు గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం ఫోటో గ్రఫీ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో టిపిజెఎ అధ్యక్షుడు భాస్కర్ ఏర్పాటు చేసే ఫోటో ఎగ్జిబిషన్ ఎంతో అర్థవంతంగా ఉంటుందని అన్నారు. తెలంగాణ చరిత్ర, సంకృతి, తెలంగాణ అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తెలంగాణ గ్రామీణ సౌందర్యన్ని వివరించే విధంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఉందని మీడియా అకాడమీ చైర్మన్ అలం నారాయణ అన్నారు. ఈ ప్రదర్శనలో ఉంచిన ఉత్తమ ఫోటోలను ఎంపిక చేసి వారికి అవార్డులు ప్రకటిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ వచ్చిన ఎంట్రీలు 216 కాగా ప్రదర్శనలో ఉన్నవి 355 ఫోటోలు అని, మొత్తం వచ్చినవి 456 అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజె రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రమణ కుమార్, ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కొప్పుల సర్వేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదగిరి.కోశాధికారి దుబ్బాక సురేష్ రెడ్డి, సభ్యులు కృష్ణ, లాయక్. కుంట్ల శ్రీనివాస్, శ్రీధర్, బిసి కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, శుభప్రద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News