Tuesday, April 1, 2025

బిఆర్ఎస్ ఎంపిలు రాజ్యసభకు హాజరుకావాలని విప్ జారీ చేసిన ఎంపి సంతోష్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులంతా సభకు హాజరుకావాలని రాజ్యసభ విప్ జోగినపల్లి సంతోష్ కుమార్ విప్ జారీ చేశారు. పార్లమెంటు సమావేశాల సంద్భంగా ఇప్పటికే లోక్ సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో ఈరోజు, రేపు రెండు రోజులపాటు బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులంతా సభకు హాజరుకావాలని ఎంపి సంతోష్ కుమార్ విప్ జారీ చేశారు.

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులంతా వ్యతిరేకంగా ఓటు వేయాలని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే లోక్ సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు బీఆర్ఎస్ ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News