Friday, April 4, 2025

ఎంపి సంతోష్ ఫోటోగ్రఫీ అదుర్స్.. ఫోటోలు వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ వీకెండ్‌లో పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రకృతి, పర్యావరణ అద్భుత దృశ్యాలను తన కెమెరాలో నిక్షిప్తం చేస్తుంటారు. అలా తాను స్వయంగా తీసిన అందమైన పక్షుల ఫోటోలను ట్విట్టర్ ద్వారా వీక్లీ డోస్ ఫోటోగ్రఫీ పేరుతో ప్రతీ ఆదివారం పంచుకునే ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ ఈ వారం సన్‌బర్డ్ పక్షి ఫోటోలను షేర్ చేశారు.

అత్యంత అందంగా, అనేక రంగులతో ఆకర్షణీయంగా ఉన్న సన్ బర్డ్ పక్షి ఫోటోలు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. చెట్టు పూల నుంచి మకరందాన్ని తలకిందులుగా జుర్రుకుంటూ ఉన్న పక్షి ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎంపి ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కొద్దిసేపటికి ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News