Friday, December 20, 2024

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

- Advertisement -
- Advertisement -

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం కొండగట్టుకు వెళ్తుండగా మార్గమధ్యలో కరీంనగర్ లోని డ్యాం సమీపంలో ఫిల్టర్ బెడ్స్ వద్ద మంత్రి గంగుల కమలాకర్ తో కల‌సి మొక్కలు నాటారు.

అనంతరం ఎంపి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. కీసరగుట్ట వలె కొండగట్టు అడవిలో ఎనిమిది వందల ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ సిపి సుబ్బారాయుడు, నగర మేయర్ సునీల్ రావు, జిల్లా కలెక్టరేట్ ఆర్ వి కర్ణన్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News