మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. మల్లన్నస్వామివారి పాదాల చెంతకు గోదావరి నీళ్లు తెస్తానని హామీ ఇచ్చి నెరవేర్చారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇదే సందర్భంలో మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను చేరుకోవడానికి నీరు ప్రవహిస్తున్న అద్భుతమైన దృశ్యాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రాష్ట్రంలోనే ఎస్సారెస్సీ తర్వాత అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్. దీని కెపాసిటి 50 టిఎంసిలు. బహుళ ప్రయోజనాలు కలిగిన ఈ జలాశయంతో ఉమ్మడి మెదక్‌తో పాటు ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాకు ప్రయోజనం కలుగుతుంది.
కొండపోచమ్మ, గంధమల్ల, బస్వాపూర్, నిజాంసాగర్, సింగూర్, తపాస్‌పల్లి మిషన్ భగీరథ ప్రాజెక్టులకు ఇక్కడి నుంచే గోదావరి జలాలను తరలిస్తారు. హైదరాబాద్ తాగునీటి కోసం 30 టిఎంసిలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టిఎంసీల నీటిని ఏడాది పొడవునా అందిస్తారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌కు అక్కడి నుంచి ఓపెన్ కెనాల్, సొరంగం ద్వారా మల్లన్నసాగర్‌లోకి గోదావరి జలాలు వస్తాయి. ఈ విధమైన ప్రయోజనాలున్న మల్లన్నసాగర్ బుధవారం అద్భుతంగా ఆవిష్కృతమైంది. ఇదే విషయాన్ని ఎంపి సంతోష్ తన ట్వీట్‌లో పొందుపరుస్తూ సిఎం కెసిఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
A promise is a promise. When our beloved CM Sri #KCR garu gives a word, he would stand by it. He promised that he would bring Godavari water to the feet of Mallanna swamy. The day has come. What an amazing sight to see the water gushing out to reach the #MallannaSagarReservoir👇. pic.twitter.com/fuzDb4LnHt
— Santosh Kumar J (@MPsantoshtrs) February 23, 2022
MP Santosh Kumar praised on CM KCR over Mallanna Sagar