మన తెలంగాణ/హైదరాబాద్: ఈ రక్షాబంధన్ సందర్భంగా ఒకరినొకరు మొక్కను బహుమతిగా ఇచ్చుకుని ఈ పండుగ జరుపుకోవాలని ఒడిశాలోని పూరి బీచ్లో ఇసుకతో ఆర్ట్ వేసి సోదర, సోదరీమణులుకు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఇంటర్నేషనల్ సౌండ్ అర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ స్పందించారు. రక్షాబంధన్ పురస్కరించుకుని మొక్కను బహుమతిగా ఇవ్వాలన్న మీ ఆలోచన అసాధారణమైనదని చాలా మంచి నిర్ణయమని తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ సుదర్శన్ పట్నాయక్ను అభినందించారు. ఈ రక్షాబంధన్ ప్రకృతికి మరింత పచ్చదనాన్ని ఇస్తుందని పర్యావరణ పరిరక్షణకు ఇలాంఇ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడం చాలా అవసరం అని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు.
Thoughtful and exceptional of you Sudarsan ji! Let this #RakshaBandhan bring much more greenery to the #Nature. Your appeal of presenting plant as a gift to sibling today mean a lot for the environment. You and your sand sculptures are unmatched. 🙏#GreenIndiaChallenge🌱🌱🌱 https://t.co/xSzGuhsoey
— Santosh Kumar J (@MPsantoshtrs) August 22, 2021
MP Santosh Kumar reacts on Sudarsan Pattnaik Art